అందం చందం – సౌందర్యానికి సలహాలు

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.చివర్లో ఆమె ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం మరువకండి.

——————–

కుచ్చుటోపి – సచిత్ర వారపత్రిక

షోకు – నాజూకు (సౌందర్య సలహాల శీర్షిక)
నిర్వహణ: రంభ మరియు ఊర్వశి (ప్రముఖ బ్యూటీషియన్లు)

1. కుర్ర చూపుల వీరయ్య (మొర్రిపాలెం)
ప్ర. నా వయసు 81.. 18 లా కనిపించాలంటే ఏం చేయాలి?
జ. ఏం చెయక్కరలేదు. 63 ఏళ్ళు వెనక్కి వెళితే సరి.

2. మచ్చల పిచ్చయ్య (రచ్చపాడు)
ప్ర. పుట్టుమచ్చలు పోవాలంటే ఏం చేయాలి?
జ. మనం పోవాలి.

3. నిక్కుల నీరజ (కక్కులూరు)
ప్ర. నా వయసు 50 దాటింది. తలపై రెండు మూడు వెంట్రుకలు నెరవడం వల్ల బెంగతో నిద్రపట్టడం లేదు.ఏం
చేయమంటారు?
జ. ‘స్లీప్వెల్’ నిద్రమాత్రలు రోజొకటి జీవితాంతం వాడండి.

4. నంకా వెంకాయమ్మ (ఢంకావారిపాలెం)
ప్ర. నా జుట్టు సగం తెల్లగాను, సగం నల్లగాను ఉంటుంది. జుట్టంతా ఒకే రంగులో ఉండాలంటే ఏం చెయ్యాలి?
జ. నల్లజుట్టుకు తెల్ల రంగుకాని, తెల్ల జుట్టుకు నల్ల రంగుకాని మీ అభిరుచి బట్టి వేసుకుంటే జుట్టంతా ఒకే రంగులో ఉంటుంది.

5. సన్నపాటి సన్యాసమ్మ (చీకుచింతలపాడు)
ప్ర. నా బుగ్గలు పీక్కుపోయి, చప్పి దవడలు కనిపిస్తున్నాయి.బుగ్గలు బూరెల్లా కనిపించడానికి ఏం చేయాలి?
జ. రేయింబవళ్ళు ‘బబుల్గమ్’ నములుతూ ఉండాలి.

6. గారపాటి బూరయ్య (జోరీగలపట్నం)
ప్ర. గారపట్టి అసహ్యంగా కనిపిస్తున్న నా పళ్ళూ టూత్పేస్ట్ ప్రకటనలో మోడల్ అమ్మాయి పళ్ళూ మెరిసినట్టు
తళతళా మెరవాలంటే ఏం చేయాలి.
జ. గోదావరి ఇసుకతో గంటకోసారి తోమండి.

7. ధగధగల ధనమ్మ (నిగనిగలూరు)
ప్ర. ముసలితనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
జ. పడుచువయసులోనే పరమపదించాలి.

8. షోకేసుల లోకేషు (రాకాసిపేట)
ప్ర. చుండ్రు పోవాలంటే ఏం చేయాలి?
జ.ఒండ్రు మట్టితో తల రుద్దాలి.

9. నిద్రలేమి భద్రమ్మ (రుద్రవరం)
ప్ర.కళ్ళచుట్టూ నల్ల వలయాలు పోవాలంటే ఏం చేయాలి?
జ.రేయింబవళ్ళూ మెలకువ లేకుండా నిద్రపోవాలి.

10.వట్టితల చిట్టయ్య (లొట్టలూరు)
ప్ర. బట్టతలపై జుట్టు మొలిచే ఉపాయం చెప్పండి
జ. జుట్టు మొలిచేవరకు పట్టు వదలకుండా బట్టతలపై పుట్టతేనె మర్దించండి.

——————–

నేనే ప్రశ్నలు అడగడం, నేనే జవాబులు రాయడం, మీరు చదవటం – అస్సలు బాలేదు. సో.. ముచ్చటగా మూడు ప్రశ్నలు అడుగుతున్నాను. జవాబులు మీరు చెప్పండి. ఉత్తమ జవాబుకు అభిషేక్, ఐశ్వర్యల పెళ్ళికి ఆహ్వానం. చెత్త జవాబుకు అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానం. సరేనా!..

1. పెళ్ళికి ము౦దు, వెనకా తన భర్త గురించి భార్య ఏమనుకుంటుంది?
2. అమెరికా అద్యక్షుడు జార్జి బుష్ కు బిన్ లాడెన్ కలలో కనబడితే, బుష్ ఏమంటాడు?
3. ఉద్యోగాలన్నీ స్త్రీలకే రిజర్వు చేస్తే ?

త్వరపడండి……..ఆలసి౦చిన ఆశాభంగం.

——————–

జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

7 Responses to అందం చందం – సౌందర్యానికి సలహాలు

  1. 1. పాపం!
    2. జీసస్!
    3. గోలీలాట, కర్రాబిళ్ళా ఆటలకు పూర్వవైభవం వస్తుంది.

    ఈ శీర్షికేదో బాగుంది. జవాబులు జనాన్నే అడగడం తమాషాగా ఉంటుంది.

  2. (1) ముందు మంచివాడు; వెనుక అమాయకుడు.

    (2) కాయ్ రాజా కాయ్.

    (3) దేశమంతా జంబలకిడి పంబే

    జ్యోతి గారు, ఇదేదొ సరదాగా వుంది. పాతరోజులలో, ‘అంధ్రభుమి ‘ లో వచ్చిన ‘అడగండి చేబుతా ‘ కి ఇది రివర్సు. మీరు అడుగూతునే ఉండండి, మేమూ ” సై “

  3. jyothi says:

    1.పెళ్ళికి ముందు అబ్బా ఆయన బంగారంలాటి మనిషి ..కొన్నేళ్ల తర్వాత నగలు పాతబడితే డిజైన్ మార్చినట్టు ఆయనను కూడా మారిస్తే బావుండును కదా?

    2.లాడెన్ ఎందుకొచ్చిన ఈ తగులాట. హాయిగా మనం వియ్యమందుకుందాం.ఏ యుద్ధం లేకుండా ప్రపంచాన్ని పంచుకుందాం.

    3.మగాళ్ళు ’వంట’రి పోరాటం చేయక తప్పదు.

  4. హిలేరియస్!!!
    సలహాలకోసం రాసిన వ్యక్తుల పేర్లు, ఊరిపేర్లు అద్భుతం.

  5. Srinivas says:

    1. పెళ్ళికి ముందు భర్త గురించి
    “ఏమైనా” అనుకుంటుంది. పెళ్ళి
    తరువాత “ఏమైనా” అంటుంది.

    2. బుష్ ఏమీ అనడు. కల చెదిరి పోయే ఉంటుంది.

    3. సామెత “ఉద్యోగం స్త్రీ లక్షణం” గా
    మారుతుంది.

  6. vihaari says:

    1. పెళ్ళికి ముందు… “నేను చూసిన ఫోటోలలో ఇదే మంచి ఫోటో”.
    పెళ్ళి తరువాత..”ఈ ఫోటో కన్నా ఇంతకు ముందు చూసిన ఆ ఫోటో బాగున్నట్లుందే”.

    2. తూచ్..తూచ్.. నా పేరు బుష్ కాదు. గుల్జార్ బషీర్ అంటాడు.

    3. “అట్ల తద్దోయ్..ఆరట్లోయ్” అని పంచెలు ఎగ్గట్టుకుని పాటలు పాడుకుంటూ జీవితం గడిపెయ్యడమే.

  7. haritha says:

    1.pelliki mundu inthakanna manchi mogudu raademo tharvatha vachhejanmalo ina ee mogudu vaddu babaoy.
    2.kalalo kuuda nannu vadalavaa??
    office ninchi vachhe bharya kosam 3.kallu kaayalu kaasettu yeduru chudatam.

Comments are closed.