Monthly Archives: December 2006

గడి

నాటి జ్యోతి మాస పత్రిక నుండి, నేటి ఈనాడు ఆదివారం దాకా గళ్ళనుడికట్టులెన్నిటినో చూసారు. రోజుల తరబడి వేధించి, వెంటాడి నిదుర చెడగొట్టినవి కొన్నైతే, చటుక్కున చిటికెలో సాధించినవి కొన్ని. ఇక ఇప్పుడు మావంతు.. త్వరలోనే మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు, మీ సమయాన్ని కాజేసేందుకు వస్తూంది, మా గడి! పొద్దు గడులలోని మాయాజాలం నుండి బయటపడగలరేమో … Continue reading

Posted in గడి | Tagged | 5 Comments

వికీ

తెలుగు వికీపీడియాలోని విశేషాల విరిమాల ఇది. గణాంకాలు, కొత్త విశేషాలు, కొత్త వ్యాసాలు మొదలైన వాటిని ఇక్కడ చూడొచ్చు. డిసెంబరు 22 శుక్రవారం నాటికి మొదటి వ్యాసం సిద్ధం! ఆరోజు ఇదే పేజీలో మళ్ళీ కలుద్దాం!!

Posted in జాలవీక్షణం | Tagged | Comments Off on వికీ

కబుర్లు

ఆరోగ్యము, వైద్యమూ ప్రభుత్వ శాఖల్లో ప్రజా సంక్షేమం రీత్యా వైద్య ఆరోగ్య శాఖ అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వాలు చాలా తరచుగా విమర్శలు ఎదుర్కొనే శాఖల్లో ఇదీ ఒకటి. ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకునే పద్ధతులను ప్రజల్లో వ్యాప్తి చేసి, ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం ఒక బాధ్యత కాగా, ప్రజలు రోగాల బారిన పడినపుడు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 1 Comment

బ్లాగుద్యమం

బ్లాగు ప్రస్తుతం నెజ్జనులకో ముఖ్య వ్యాసంగమై పోయింది. తెలుగు బ్లాగులు బాగా వస్తున్నాయి. రోజూ కొత్త బ్లాగరులు చేరుతూనే ఉన్నారు, కొత్త బ్లాగులు వెలుస్తూనే ఉన్నాయి. వివిధ విషయాలపై బ్లాగులు రాస్తున్నారు. బ్లాగుల ప్రగతి ఎలా ఉంది? అవి ఎలా ఉంటున్నాయి? వాటి ప్రస్థానం ఎటువైపు? ఇటువంటి విషయాలను తాకుతూ వెళ్ళే బ్లాగు పరిశీలనా శీర్షిక … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 5 Comments

‘చుక్కపొడిచింది’ సమీక్ష

– త్రివిక్రమ్ ఈ కథలసంపుటిలో పాలగిరి విశ్వప్రసాద్ రాసిన పది కథలు, ఒక వ్యాసం ఉన్నాయి. ఈ పది కథల్లో స్త్రీ పురుష సంబంధాల్లోని భిన్న పార్శ్వాలను చూపే కథలు, ఆర్థిక సమస్యలు, మానవసంబంధాల్లోపలి ఆర్థిక సంబంధాలను విప్పి చూపే కథలు, మనుషుల ప్రవర్తన గురించిన కథలు , భూస్వామ్యభావజాలంతో నిండిన రాయలసీమ గ్రామాల్లో దళితులెలా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 4 Comments

మసకతర్కం

బౌద్ధగ్రంథాల్లో క్రీ. పూ. 6వ శతాబ్దానికి చెందిన ఆరుగురు దార్శనికుల ప్రస్తావన ఉంది. వారిలో సంజయబాలాత్రిపుర (పాళీ భాషలో సంజయవేలఠ్ఠపుర అనో ఇంకేదో అంటారు) మసకతర్కాన్ని ప్రచారం చేశాడు. ఆయన ఆ పేరు వాడలేదనుకోండి. కానీ సారాంశం మాత్రం అదే! ” ఈ సృష్టిలో ఏదీ స్పష్టంగా ఉన్నట్లనిపించడం లేదు. అంతా మసకమసకే పొ” మన్నాడాయన. … Continue reading

Posted in వ్యాసం | 9 Comments

అతిథి

యర్రపురెడ్డి రామనాథరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తెలుగు బ్లాగుల్లో అత్యుత్తమ బ్లాగులను ఎంచవలసి వస్తే మొదటి మూడు స్థానాల్లో యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తన … Continue reading

Posted in వ్యాసం | Tagged | 5 Comments

సినిమా

ఈ ఏటితో తెలుగు సినిమాకు డెబ్భై ఐదేళ్ళు నిండాయి. 1931లో మొదలైన (టాకీ) సినిమాలు 1950ల నుంచి తెలుగువాళ్ళను అచ్చంగా సినీమాయలో పడేశాయి. సమాజంలో వీటికున్న విస్తృతి, ప్రభావశీలతల వల్ల సినిమాలు ఒక శక్తివంతమైన మాధ్యమగా అవతరించాయి. తెలుగువాళ్ళనింతగా ప్రభావితం చేస్తున్న సినిమాలెలా తయారవుతాయో తెలుసుకోవాలనే కుతూహలం గలవారి కోసం ఈ సినిమా శీర్షిక. రానున్న … Continue reading

Posted in వ్యాసం | Tagged | 7 Comments