కాపీహక్కులు

కాపీ హక్కులు
పొద్దులో ప్రచురణార్థం పంపే రచనలు రచయితల స్వంత రచనలై ఉండాలి. తమ స్వంతం కాని రచనలను పొద్దుకు సమర్పించవద్దని మనవి.

పొద్దులో ప్రచురించిన రచనలపై సర్వహక్కులూ ఆయా రచయితలకే చెందుతాయి. వారి నుండి రాతపూర్వక అనుమతి లేనిదే రచనలను గానీ, రచనల్లోని భాగాలనుగానీ ఇతర ప్రచురణలలో ఉపయోగించరాదు. అనుమతులను పొద్దుకు మెయిలు రాసి పొందవచ్చు.

కాపీహక్కుల విషయమై పొద్దు విధానం:

  • పొద్దులో ప్రచురించిన రచనలపై సర్వ హక్కులూ ఆయా రచయితలకే చెందుతాయి.
  • ఇంతకు ముందు అచ్చులోగానీ, అంతర్జాలంలోగానీ ప్రచురించబడిన రచనలు పొద్దులో ప్రచురణకి పరిగణించబడవు.
  • తమ రచనలలో ఫొటోలుగాని, ఆడియోగాని, వీడియోగాని, మరేదైనా తమకి సొంతం కాని సమాచారాన్ని వాడినట్టైతే, ఆ సమాచారపు కాపీహక్కుల వివరాలను, హక్కుదారుని నుండి పొందిన అనుమతి వివరాలను రచయితలు పొద్దు సంపాదక వర్గానికి తెలియజేయాలి. కాపీహక్కులు కలిగిన కంటెటుని తగిన అనుమతులు లేకుండా వాడుకొన్న రచనలు పొద్దులో ప్రచురణార్హం కాదు.
  • పొద్దులో ప్రచురించబడ్డ రచనలను రచయితలు తమ తమ స్వంత బ్లాగులలో రెండు వారాల తరువాత ప్రచురించుకోవచ్చు.
  • పొద్దులో ప్రచురితమైన తమ రచనలను రచయితలు తమ బ్లాగుల్లో కాక, అంతర్జాలంలో ఇతర చోట్ల మళ్ళీ ప్రచురించదలిస్తే, రచననంతటినీ కాకుండా, అందులో కొన్ని భాగాలను మాత్రమే ఉటంకిస్తూ, పొద్దులోని పూర్తి రచనకి లింకు ఇవ్వాలి.
  • పొద్దులో ప్రచురించబడిన తమ రచనలను అచ్చు పత్రికలకు పంపదలచుకొంటే, ఆ రచన పొద్దులో ముందుగా ప్రచురించబడిందని ఆయా ‌పత్రికల సంపాదకులకు రచయితలే తెలియజేయాలి. వేరే పత్రికకి పొద్దులో ప్రచురించబడిన రచనలని పంపేముందు – ఆయా పత్రికల ప్రచురణ విధానాలను తెలుసుకోవలసిన బాధ్యత పూర్తిగా రచయితలదే. పొద్దులో తమ రచన ప్రచురించబడిన సంగతి వేరే పత్రికలకు తెలియజేయకపోయినట్లైతే – తదనంతర పరిణామాలన్నిటికీ ఆ రచయితే బాధ్యత వహించాలి. పొద్దు సంపాదక వర్గం తాము పంపిన, తమకు అందిన ఆన్ని ఈమెయిళ్లనీ, రచయితలతో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలనీ భద్రపరిచి ఉంచుతుంది.
  • పొద్దులో ప్రచురించే రచనలలో చిత్రాలు, ఫొటోలు, ఆడియోలు, వీడియోలు, లేదా ఇతర సమాచారం వంటి సందర్భోచితమైన అదనపు కంటెంటును పొద్దు సమకూర్చుకొని, తగు అనుమతులు పొంది ఆయా రచనలలో ఉపయోగిస్తుంది. అటువంటి కంటెంటుని వాడుకోవడానికి అవసరమైన అన్ని అనుమతులూ పొద్దు సంపాదక వర్గం పొద్దుకోసం మాత్ర్రమే పొందుతుంది. సదరు రచనలను రచయితలు ఎక్కడైనా మళ్ళీ ప్రచురించదలిస్తే, అదనపు కంటెంటు అనుమతుల విషయమై రచయితలు పొద్దు సంపాదక వర్గాన్ని సంప్రదించవలసి ఉంటుంది.
  • రచయితలు కాక, వేరెవ్వరూ పొద్దులో ప్రచురితమైన రచనలను ముందుగా పొద్దు అనుమతి పొందకుండా అంతర్జాలంలోగాని, వేరెక్కడైనాగానీ వాడుకోరాదు. రచయితలు కాక, వేరే పత్రికలుగాని, సంస్థలుగాని – పొద్దులో ప్రచురించబడిన రచనలని తిరిగి ప్రచురించదలచుకొన్నా, లేదా వేరే రకంగా ఉపయోగించదలచినా – పొద్దు సంపాదకవర్గానికి తెలియజేస్తే, అయా రచయితలని సంప్రదించి పొద్దు సంపాదకవర్గం రచయిత నిర్ణయాన్ని తెలియజేస్తుంది.
  • కాపీహక్కులు, అనుమతులకు సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను editor@poddu.net అనే ఈమెయిలైడీకి ఈమెయిలు పంపడం ద్వారానే చెయ్యాలి. ఈ విషయమై పొద్దులోని వివిధ పేజీలకు వ్యాఖ్యల ద్వారా పంపే సందేశాలను పొద్దు పరిశీలించదు. ఇతర పద్ధతుల ద్వారా పంపే ఉత్తరాలను, ఇతర ఈమెయిలైడీలకు పంపే ఈమెయిళ్ళను కూడా పొద్దు పరిశీలించదు.

నిష్పూచీ

ఈ పత్రికలో ప్రచురించిన రచనలు, వ్యక్తపరిచిన అభిప్రాయాలు – ఆయా రచయితలవే, పొద్దువి కాదు.

పాఠకులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాలే.

5 Responses to కాపీహక్కులు

  1. sriarunam says:

    nynu poddu dwaraa naa rachanalani elaa pampinchaali?

  2. Pavan Kumar says:

    Dear All,
    i am looking for telugu fonts- kranthi, ashwini, pallavi, aradhana, jyothi… etc.
    please guide me where can i get these fonts. needed urgently. help me plz.
    Regards
    pavan kumar

  3. phani says:

    Superb blog for telugu people

  4. mee patrika bhagundhi.

Leave a Reply to పొద్దు Cancel reply

Your email address will not be published. Required fields are marked *